గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయామం చేయండి. వ్యాయామాన్ని మీ దినచర్యలో భాగంగా చేసుకోండి. రోజూ కనీసం 10,000 అడుగులు నడవండి. భోజనం చేసిన తర్వాత కాసేపు నడవండి. బరువును అదుపులో ఉంచుకోవాలి. బ్లడ్ షుగర్ లెవల్స్, బీపీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. వైద్యుల సలహా మేరకు హెచ్చుతగ్గులను నియంత్రించుకోవాలి. చిరుతిళ్లు, నూనె పదార్థాలు తినకూడదు. గంటల తరబడి ఒకే చోట కూర్చోవద్దు.