గోంగూర వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గోంగూరలో కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రేచీకటితో బాధపడేవారు గోంగూర తింటే ఫలితం ఉంటుంది. అలాగే దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడేవారు గోంగూర తింటే మంచి ఫలితాలు వస్తాయి. అంతే కాకుండా విరోచనాలు అధికంగా అయ్యేటప్పుడు కొండ గోంగూర నుండి తీసిన జిగురును నీటితో కలిపి త్రాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. అయితే కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు గోంగూరకు దూరంగా ఉండాలి.