చింతపండులో ఫైబర్ మరియు జీరో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ మరియు ఫ్లేవనాయిడ్స్ బరువు తగ్గడానికి సహకరిస్తాయి. చింతపండులో ఉండే హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ ఆకలిని అణిచివేస్తుంది. చింతపండు మలబద్ధకం మరియు కడుపు నొప్పికి చెక్ పెడుతుంది. ఇది చర్మ ఆరోగ్యానికి మరియు మధుమేహ నియంత్రణకు కూడా బాగా పనిచేస్తుంది. చింతపండులోని ఫ్లేవనాయిడ్‌లు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.