వాహనాలకి హై సెక్యూరిటీ ప్లేట్లు తప్పనిసరి జిల్లా లో తిరిగే ప్రతి వాహనానికి తప్పనిసరిగా హై సెక్యూరిటీ ప్లేటు కలిగి ఉండాలని రవాణాశాఖ అదికారులు స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా ఫ్యాన్సీ నెంబర్ ప్లేటు గాని లేదా ప్లేట్లు కేంద్ర మోటారు వాహనాల నియమాలలో వేరే ఏ విధమైన నెంబరు ప్లేటును వాహనానికి అమర్చిన ఆయా వాహనాలపై కేసు నమోదు చేసి వెయ్యి రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుందని రవాణాశాఖ ఉపకమిషనర్ రాజారత్నం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వాహనదారులు నిబంధనలను గమనించి తమ వాహనం నెంబర్ ప్లేట్లని వెంటనే హై సెక్యూరిటీ ప్లేట్లుగా మార్చుకోవాలని తెలిపారు. అదేవిదంగా ఫ్యాన్సీ నెంబరు ప్లేట్లు ఇష్టానుసారంగా వాహనానికి అమర్చినట్లయితే అటువంటి వాహనాలను సీజు చేస్తామని హెచ్చరించారు.
ఈ నెల 20 వ తేదీ నుండి వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్ల పై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రత్యేక తనిఖీలను నిర్వహించి ఫ్యాన్సీ నెంబరు ప్లేట్లు కలిగిన వాహనాల పై కేసులు నమోదు చేసి సీజు చేస్తామని వెళ్లడించారు. ఇదిలా వుండగా ఇప్పటికే కొంత మంది ఆన్లైన్ ద్వా రా హై సెక్యూరిటీ ప్లేట్లు బుక్ చేసుకొని కేంద్రం వద్ద వదిలేసారు. దీనితో వేలసంఖ్యలో రవాణాశాఖ కేంద్రం వద్ద హై సెక్యూరిటీ ప్లేట్లు పేరుకుపోయాయి.