అమర్నాథ్ యాత్రికుల ప్రయాణాన్ని సులభతరం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పుణ్యక్షేత్రానికి సులువుగా చేరుకునేందుకు వీలుగా ఓ రహదారి నిర్మించాలని నిర్ణయించింది. దీని కోసం చందన్ వాడీ, సంగం మధ్య 22 కి.మీ మేర రహదారిని నిర్మించాలని కేంద్రం ప్లాన్ చేసినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. దీనిలో 11 కి.మీ సొరంగ మార్గం కూడా ఉందని పేర్కొంది.