ఝార్ఖండ్ లోని తూర్పు సింగ్భుమ్ లో ఓ బాలుడికి కల్వర్టుతో వివాహం జరిపించారు. ఇక్కడ సంక్రాంతి తర్వాత రెండో రోజు గిరిజనులు అఖన్న జాతర జరుపుకొంటారు. దీనిలో భాగంగా చెట్టుకు లేదా కల్వర్టుకు చిన్నారులను ఇచ్చి వివాహం జరిపించడం సంప్రదాయంగా వస్తోంది. పిల్లలకు తొలి దంతం పైదవడకు వస్తే ఇలా వివాహం జరిపిస్తారు. ఇలా వివాహం జరిపించకపోతే వివాహం అయిన తర్వాత ఆ వ్యక్తి భాగస్వామి వెంటనే మరణిస్తారని నమ్ముతారు.