గుంతకల్లు పట్టణంలోని హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు ఎదుర్కొం టున్న సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు బుధవారం గుంతకల్లుకు వచ్చిన జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి కి వినతిపత్రాన్ని అంద జేశారు. ఈ సందర్భంగా ఆ విధ్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ బిసి బాలుర హాస్టల్ కు సొంత భవనం ఏర్పాటు చేయాలని, మహిళా విద్యార్థినిలకు ప్రత్యేక వసతి గృహం ఏర్పాటు చేయాలని, గుంతకల్లు నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటు వంటి సాంఘిక సంక్షేమ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వసతి గృహాలలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న వార్డెన్, వంట మనిషి, కామాటి పోస్టులను భర్తీ చేయాలన్నారు. గుత్తి మండలం లోని సేవగడ్ లో ఉన్న వసతి గృహాన్ని తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్ర మంలో ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు వేణుగోపాల్, వెంకట్ నాయక్, ఆర్గనైజింగ్ కార్య దర్శి వినోద్ కుమార్, పట్టణ సహాయ కార్యదర్శి అఖిల్ తదితరులు పాల్గొన్నారు.