అనారోగ్యంతో బాధపడుతున్న నలుగురు కార్యకర్తలకు కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు ఆర్థిక సహాయం అందించారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా వలేటివారిపాలెం మండలం కొండసముద్రం గ్రామంలో గురువారం నాగేశ్వరరావు ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడుతున్న మన్నం సుబ్బారావు, నల్లమోతు పద్మ, తాటిపర్తి మాతమ్మలను గుర్తించి పరామర్శించారు. అక్కడికక్కడే సుబ్బారావు, పద్మకు చెరొక 10వేలు, మాతమ్మ, బసమ్మలకు చెరొక 5 వేలు మొత్తం 30 వేల ఆర్థిక సహాయం అందించారు.