జమైకా దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ ఖాతా నుండి 12 మిలియన్ డాలర్లు( మన కరెన్సీలో 97 కోట్ల 60 లక్షలు) మాయమయ్యాయి. అకౌంట్ నుండి మాయమైన డబ్బంతా బోల్ట్ లైఫ్ టైమ్ సేవింగ్స్ డబ్బులని అతని లాయర్ లింటన్ పి.గార్డన్ తెలిపారు. కింగ్ స్టన్ అనుబంధ కంపెనీలో బోల్ట్ పెట్టుబడులు పెట్టారని, తాజాగా షేర్స్ లో నష్టాలు రావడంతో బోల్ట్ అనుమతి లేకుండా డబ్బు మాయం చేశారని అన్నారు. దీనిపై కోర్టులో కేసు వేస్తామని తెలిపారు.