దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఆధునికీకరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో విశాఖపట్నం-కాకినాడ మధ్య నడిచే మెము ఎక్స్‌ప్రెస్ సర్వీసులను ఈనెల 21, 22 తేదీల్లో రద్దు చేశామని సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ఇక గుంటూరు-విశాఖ మధ్య నడిచే 17239 నంబరు గల సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ఈనెల 21, 22 తేదీల్లో గుంటూరు నుంచి సామర్లకోట స్టేషన్ వరకు, విశాఖ నుంచి గుంటూరు వెళ్లాల్సిన 17240 నంబరు గల సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ఈనెల 22, 23 తేదీల్లో సామర్లకోట నుంచి బయలుదేరి గుంటూరు వెళుతుందని పేర్కొన్నారు. సామర్లకోట-విశాఖపట్నం మధ్య రాకపోకలను ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు రద్దు చేశామని తెలిపారు. అలాగే విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (12718) ఈనెల 21, 22 తేదీల్లో విజయవాడ నుంచి తుని స్టేషన్ వరకు....విశాఖ నుంచి విజయవాడ వెళ్లాల్సిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఈనెల 21, 22వ తేదీల్లో తుని నుంచి బయలుదేరి విజయవాడ చేరుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 21, 22వ తేదీల్లో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు విశాఖ, తుని స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించవని తెలిపారు. ఈ మార్పును ప్రయాణికులు గమనించాలని కోరారు.