అల్పులు భౌ భౌ అని అరుస్తున్నారని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. ప్రజలు మెచ్చిన ప్రజానాయకుడిపై కొందరు భౌ..భౌ.. అని అరుస్తున్నారు. వారి అరుపులు, వారు ఊగిపోవడాలు చూస్తుంటే ఒక పద్యం గుర్తొస్తోందని అన్నారు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను, సజ్జనుండు పలుకు చల్లగాను.. కంచు మోగినట్లు కనకంబు మోగునా...అని వేమన గారు పద్యం రాశారు. మన రాష్ట్రంలో సజ్జనుడు అయిన నాయకుడు వైయస్ జగన్ గారు.. అల్పులు మాత్రం చాలా మంది ఉన్నారు. వారంతా... గుంపులుగుంపులుగా వస్తున్నారు. ఎవరెంతమంది కలిసొచ్చినా... సింహం సింగిల్గానే వస్తుంది... కంచులెన్ని మోగినా.. అన్నట్టు వారంతా వీకెండ్ పొలిటీషియన్స్ మాత్రమే... అంటూ మంత్రి రోజా విమర్శించారు.