కిషోర బాలికల్లో రక్తహీనత నివారణ దిశగా తగు చర్యలు చేపట్టాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డి ఐ ఒ ) డాక్టర్ టి. జగన్మోహనరావు అన్నారు. గురువారం పార్వతీపురం పట్టణంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను ఆయన సందర్శించి విద్యార్థులకు రక్తహీనత , పోషకాహారం , పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. వైద్య సిబ్బంది నిర్వహించిన హీమోగ్లోబిన్ రక్త పరీక్షలను పరిశీలించారు. అనంతరం విద్యార్దులకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలను మ్రింగించారు. 10 నుండి 19 సం. వయసు గల కిశోర్ బాలికల ఆరోగ్య పర్యవేక్షణ దృష్ట్యా వైద్య ఆరోగ్య శాఖ కొత్త గా ప్రవేశ పెట్టిన యాప్ లో ఈ పరీక్షల వివరాలను నమోదు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. రక్తహీనత గా గుర్తించిన కొందరు విద్యార్థులకు అందుకు గల కారణాలను వివరించి , జాగ్రత్తలు సూచించారు. సమతుల ఆహారాన్ని తీసుకోవాలని , బరువు తగ్గకుండా చూసుకోవాలని ఏవైనా అనారోగ్య లక్షణాలు వుంటే వెంటనే వైద్య సిబ్బంది కి తెలియ జేయాలని మొదలగు అంశాలపై డి ఐ ఒ జగన్మోహన్ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పి. వి. ప్రసాద్ , పి. పార్వతి , సూపర్ వైసర్స్ పుష్ప , జయ గౌడ్ , వైద్య సిబ్బంది పాల్గొన్నారు.