ఏడాదిన్నర చిన్నారిని తోడేలు చంపి తిన్న ఘటన యూపీ సుల్తాన్ పుర్ జిల్లాలో బుధవారం జరిగింది. సందీప్ కుమార్ కుటుంబం మహర్వా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటోంది. రాత్రి భోజనం తర్వాత ఆరుబయట నిద్రించగా చిన్నారి ప్రీతిని తోడేలు ఎత్తుకెళ్లింది. పాప కనిపించకపోవడంతో గ్రామస్థుల సాయంతో వెతికేందుకు వెళ్లారు. ఊరు బయట చిన్నారిని తోడేలు తినడాన్ని గమనించారు. ఈ ఘటనతో విషాదం నెలకొంది.