దొంగలు ఏకంగా సెల్ టవర్ నే ఎత్తుకెళ్లిన ఘటన బీహార్ పట్నాలోని సబ్జీబాగ్ లో జరిగింది. ఓ భవనంపై జీటీఎల్ కంపెనీ సెల్ టవర్ కు రిపేర్ చేయాలని ఉద్యోగులమని భవనం యజమానికి చెప్పి పైకి వెళ్లిన దుండగులు టవర్ ను భాగాలుగా చేసి ఎత్తుకెళ్లారు. దీనిపై సంస్థ మేనేజర్ కు యజమాని చెప్పగా 4 నెలలుగా అంతర్గత విచారణ జరిపారు. ఫలితం లేకపోవడంతో ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు.