బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కారులో ప్రయాణిస్తూ సీటు బెల్ట్ ధరించకుండా వీడియో తీసుకోవడంపై వివాదం రేగుతోంది. ప్రధానే చట్టాల ఉల్లంఘనలకు పాల్పడ్డారని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. దీంతో తాను తప్పు చేశానని.. క్షమించాలని రిషి సునాక్ ప్రకటన విడుదల చేశారు. అక్కడి చట్టం ప్రకారం సీటు బెల్ట్ ధరించనందుకు 500 పౌండ్ల జరిమానా విధిస్తారు. ఈ మొత్తాన్ని ఆయన కట్టారో లేదో వెల్లడి కాలేదు.