గుంతకల్లు మండలంలోని అయ్య వారిపల్లిలో అర్హులైన 90 మంది పేదలకు గురువారం ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి ఇళ్ల స్థలాల పట్టా లను పంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సొంతింటి కల సాకారం చేయడమే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అన్నారు. ప్రభుత్వం ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లను నిర్మించి ఇస్తోందని అన్నారు. స్థలాలు పొందిన పేదలు తమ ఇళ్ల నిర్మాణంలో భాగస్వామ్య మై త్వరితగతిన ఇళ్లను నిర్మించు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకట లక్ష్మి, ఎంపిపి మాధవి, మండల తహశీల్దార్ బి. రాము, మార్కెట్టు యార్డు ఛైర్మన్ ఎస్వీఆర్. మోహన్, రూరల్ సిఐ మహేశ్వర రెడ్డి, వైకాపా నాయకులు పాల్గొన్నారు.