కృష్ణా జిల్లా, ఉయ్యూరు నగరపంచాయతీ పరిధిలోని అనధికార లే అవుట్లపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కా ర్యదర్శిని ఆదేశించారు. కొన్నేళ్లుగా ఉయ్యూరు నగర పంచాయతీ పరిధిలో విచ్చలవిడి అనధికార లే అవుట్లతో ప్రభుత్వానికొచ్చే ఆదాయానికి కొందరు రియ ల్ ఎస్టేట్ వ్యాపారులు గండికొట్టారు. దీనిపై కొంద రు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు చేశారు. వా రు విచారణ జరిపి రూ.7కోట్ల 19లక్షల 59వేల 500 బాధ్యుల నుంచి వసూలు చేయాలని 2011లో నివేదిక సమర్పించింది. అప్పటి నుంచి అధికారులు ప ట్టించుకోపోవడంతో 2020 ఫిబ్రవరి 7న రాష్ట్ర లోకాయుక్తకు ఫిర్యాదులందాయి. దీంతో లోకాయుక్త కా ర్యాలయం ఇన్వ్‌స్టిగేషన్ డీడీని విచారణకు ఆదేశించింది, ఆమేర 2005 నుంచి నగర పంచాయతీ పరిధిలో 30 అనధికార లే అవుట్లపై సవివర మైన నివేదికను డీడీ పి.రాజకుమార్ అందజేశారు. రాష్ట్ర ప్ర భుత్వానికి లే అవుట్ల ద్వారా జమ కావల్సిన మొత్తం జమవలేదని నివేదికలో పేర్కొన్నారు. దీంతో 2012 ఏప్రిల్ 23 నుంచి ఇప్పటివరకు పనిచేసిన 21 మంది నగర పంచాయతీ కమిషనర్లు, 12 మంది టౌన్ ప్లానింగ్ అధికారులపై క్రమశిక్షణ చర్యలకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిని లోకాయుక్త ఆదేశించింది. సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ ఫిర్యాదు మేర లోకాయుక్తపై ఆదే శాలిచ్చింది.