రాయచోటి పట్టణంలోని కొత్తపేటకు చెందిన సుంకారపు నిర్మల (47), ఆమె కుమారుడు మహేష్ కూమార్ (27) గురువారం తెల్లవారుజామున విషద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ఎస్సై నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆయన వివరాల ప్రకారం. మృతి చెందిన నిర్మల కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. నిర్మలకు ఇద్దరు కుమారులు. ఇటీవల వారు పలువురి వద్ద రూ. 3.50 లక్షలు అప్పు చేశారు. ఈ విషయమై కుమారులతో వాదనలు జరిగాయన్నారు.
చిన్న కుమారుడు సమాధానం చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన నిర్మల, ఆమె పెద్ద కుమారుడు మహేష్ కుమార్ విషద్రావణం తాగారని పేర్కొన్నారు. నిర్మల అక్కడికక్కడే మృతి చెందగా, మహేష్ కుమార్ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.