రహదారిపై ప్రయాణించే సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని ఉప రవాణా కమిషనర్ రాజా రత్నం అన్నారు. ఈ మేరకు రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా లారీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో డ్రైవర్లకు ఆవగాహనా కార్యక్రమం, వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా డ్రైవర్లనుద్దేసించి మట్లాడారు. దేశంలో గత ఏడాది 4,12,432 ప్రమాదాలు జరగ్గా అందులో 1,53,972 మంది మరణించారని తెలిపారు.ఈ ప్రమాదాల్లో కేవలం అతి వేగంగా ప్రయాణించిన కారణంగా 2,95,522 ప్రమాదాలు జరిగాయని, అందులో 1,07,236 మంది డ్రైవర్లు మృత్యవాత పడ్డారని తెలిపారు. విశాఖ నగరంలో 2344 ప్రమాదాల్లో 755 మంది మరణించారని తెలిపారు. వాహనాలు నడిపే సమయాల్లో ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
డ్రైవర్లు సెల్పోన్లో మాట్లాడుతూ, ఓవర్ లోడింగ్తో వాహనాలు నడపరాదన్నారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగాహెల్మెట్,సీటు బెల్టు ధారణ , ఆటో టాక్సి ఇంతర డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. లారి అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకెల్లారు. మారుతీ జంక్షన్ వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని ,ఫ్లైఓవర్ బ్రిడ్జ్లపై వాహనాలు జారడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. ప్రమాదాల నివారణకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు.ప్రమాద రహితంగా వాహనాలు నడుపుతున్న 10 మంది డ్రైవర్లను సత్కరించి సర్టిఫికేట్లు అందించారు. విశాఖ ఐ ఆసుపత్రి సౌజన్యంతో కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఆర్టీఓ ఐ.వేణు గోపాలరావు , మోటారు వాహన తనిఖీదారులు ఎం బుచ్చిరాజు,గణేష్ రెడ్డి , హర్బర్ ట్రాఫిక్ సీఐ తులసీరావు ,లారీ యజమానులు , డ్రైవర్లు పాల్గొన్నారు.