కర్నూలు జిల్లా పత్తికొండలో హనుమంతరెడ్డి కుటుంబం నివాసం ఉంటుంది. కొన్ని రోజుల కింద మనువడి వివాహానికి వచ్చిన హనుమంతరెడ్డి తల్లి శివమ్మ అక్కడే ఉంటుంది. శుక్రవారం ఉదయం ఆకలిగా ఉంది అన్నం పెట్టమని, టిఫిన్ అయినా తెచ్చివ్వాలని ఆమె కోరడంతో ఆగ్రహించిన కుమారుడు కోడలితో కలిసి దాడిచేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఆస్తి అనుభవిస్తూ ఇలా దాడి చేశారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.