ఓ యువకుడు బైకు నడుపుతూ స్టంట్ చేసి కటకటాల పాలైన ఘటన యూపీలోని ఘజియాబాద్ లో చోటుచేసుకుంది. ఈ వీడియోలో యువకుడు ఒక చేత్తో బైక్ నడుపుతూ రెండో చేత్తో స్టైల్ గా కూల్ డ్రింక్ తాగుతూ ఉంటాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో బైకు ప్రమాదకరంగా నడపడంతో యువకుడి కోసం గాలించిన పోలీసులు, ఎట్టకేలకు యువకుడ్ని గుర్తించి అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa