దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లపై వరుసగా రాళ్ల దాడులు జరుగుతున్నాయి. ఇటీవల విశాఖలో దాడి జరగ్గా తాజాగా, బీహార్‌లోని కతిహార్ జిల్లాలో కొందరు దుండగులు 22302 నంబర్ రైలుపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో సి6 బోగీ విండో అద్దాలు దెబ్బతిన్నాయి. అయితే, ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.