దళితుడి ముఖంపై ఉమ్మి వేసి, అతడితో బూట్లు నాకించాడు ఓ పోలీసు. ఈ ఘటన నవీ ముంబైలో చోటుచేసుకుంది. ఓ రెస్టారెంట్లో గొడవ సందర్భంగా వికాస్, అతని ఫ్రెండ్‌పై యజమానులు దాడి చేశారు. ఆ టైమ్‌లో పోలీసు సిబ్బందితో అక్కడి వచ్చిన దినేశ్ పాటిల్ తనను స్టేషన్‌కు తీసుకెళ్లి హింసించారని వికాస్ వాపోయాడు. తనపై ఉమ్మి వేసి, బూట్లు నాకించాడని తెలిపాడు. దినేశ్ పాటిల్‌పై కేసు నమోదు చేసిన ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు.