ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ డాక్టర్ బీఆర్ అం బేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట శుక్రవారం కేవీీ పఎస్, దళిత ప్రజా సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. దళిత ఐక్య వేదిక కన్వీనర్ జంగా బాబూరావు మాట్లాడుతూ... దళిత, గిరిజన నిధులను పాలకులు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. సబ్ ప్లాన్ చట్టాన్ని పొడిగించి శాశ్వత చట్టంగా రూపొందించాలన్నారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి పచ్చిమాల వసంతకుమార్ మాట్లాడుతూ... దళిత, గిరిజలనుకు జనాభా ఆధారంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండు చేశారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లాకు అంద జేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు, వీసీకే పార్టీ జిల్లా అధ్యక్షుడు బొంతు రమణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సకిలే సూర్యనా రాయణ, నాయకులు యలమంచిలి బాలరాజు, శెట్టిబత్తుల తులసీరావు, వాకపల్లి హరీష్, పాము బాలయ్య, నిమ్మకాయల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.