చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం నెక్కొంది సమీపంలోని అగస్త్యేశ్వరస్వామి కొండపై రెండు ముక్కలైన దశలో ఉన్న ఒక రాతి మీద అక్షరాలు క్రీ.శ. 1674వ సంవత్సరానికి చెందిన చారిత్రక ఆధారమని తేలింది. అగస్త్యేశ్వరాలయం కొండ శిఖరాగ్రాన విశాలమైన ప్రదేశంలో అగస్త్య మహారుషి పూజించిన శివలింగాన్ని ప్రతిష్ఠించడంతో ఈ ఆలయానికి అగస్త్యేశ్వరాలయంగా పేరువచ్చిందని చెబుతారు. ఏటా ఇక్కడ మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆలయం వద్ద 16 స్తంభాలపై నాలుగు అంతస్తుల గౌనోళ్లమండపం 18 మెట్లతో అత్యంత సుందరంగా నిర్మించారు. ఈ మండపానికి సంబంధించిన ఆధారం సమీపంలోనే లభించింది.