నాడు- నేడు పథకం కింద పాఠశాలల్లో చేపడుతున్న నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న సిమెంటు బస్తాలు గడ్డ కడితే ప్రధానోపాధ్యాయులే బాధ్యత వహించాలని పాఠశాల విద్యాశాఖ అంటోంది. ఈ మేరకు కొద్దిరోజుల కిందట ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. అలా నిరుపయోగంగా మారిన సిమెంటు బస్తాలను మార్చుకునేందుకు కూడా అవకాశం లేదని తెలిపింది. ఒకవేళ సిమెంట్ అదనంగా ఉంటే అవసరమైన పాఠశాలలకు పంపాలని, కొరత ఉంటే తెప్పించుకోవాలని సూచించింది. ఈ ఆదేశాలతో ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే నాడు- నేడు పనులు పెద్ద తలనొప్పిగా మారితే, ఇలాంటి వింత ఆదేశాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయని అంటున్నారు. ఈ పనుల నుంచి తమను తప్పించాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు.