రాష్ట్ర ప్రభుత్వం మహిళా పోలీసులకు సమగ్రమైన స్పెషల్ రూల్స్‌ను రూపొందించింది. గ్రామ, వార్డుస్థాయిలో మహిళా పోలీసుల పనితీరును నెలవారీ నివేదికల ద్వారా అంచనా వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ‘ఆంధ్రప్రదేశ్ మహిళా పోలీస్ (సబార్డినేట్ సర్వీస్) రూల్స్-2021 ప్రకారం ప్రత్యేక నియమాలతో ఉత్తర్వులు విడుదల చేసింది. స్థానిక పోలీసుస్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ మహిళా పోలీసులపై మండల పర్యవేక్షణాధికారిగా వ్యవహరిస్తారు.