ఎంతో తియ్యగా, రుచికరంగా ఉండే సపోటా పళ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. సపోటాల్లో ఉండే విటమిన్ ఏ, సీ కళ్లకు మేలు చేస్తాయి. బాడీలోని విష పదార్థాలను బయటికి పంపేస్తాయి. బాడీలో వేడి పెరిగిపోతే సపోటాలు తినాలి. వీటిలోని టాన్నిన్ వేడిని పోగొట్టి చలవ చేస్తుంది. అలసిపోయిన వారు సపోటాలు తింటే, వీటిలో ఉండే సుక్రోజ్ శరీరానికి వెంటనే ఎనర్జీ ఇస్తుంది.