ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఘోరం జరిగింది. ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ముగ్గురు మరణించారు. రైల్వే బ్రిడ్జిపై ఇద్దరు పురుషులు, ఒక మహిళ వస్తుండగా నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు పురుషులు రైలు పట్టాలపైనే మృతి చెందగా మహిళ పట్టాల పై నుంచి కిందపడి చనిపోయారు. పట్టాలపై ఉన్న మహిళను తప్పించబోయి పురుషులు కూడా మృత్యువాత పడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.