మహిళా ఐఏఎస్ ఇంట్లోకి అర్ధరాత్రి సమయంలో ఓ డిప్యూటీ తహసీల్దార్ చొరబడటం తీవ్ర కలకలం రేపింది. ఉద్యోగం విషయం మాట్లాడేందుకు అంటూ ఇంట్లోకి వచ్చిన అతన్ని చూసి ఆ అధికారిణి కేకలు వేయడంతో భద్రతా సిబ్బంది అతడ్ని పట్టుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్ తో పాటు అతని వెంట వచ్చిన మరో వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరగగా, పోలీసులు అత్యంత రహస్యంగా ఉంచారు.