వ్యవసాయరంగంలో అన్నదాతకు ప్రయోజనకర పరిశోధనలు అందుబాటులోకి రావాలని వైవీయూ పోస్టుగ్రాడ్యుయేషన్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ క్రిష్ణారెడ్డి పేర్కొన్నారు. వైవీయూలో శనివారం పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో వ్యవసాయ ప్రక్రియ సవాళ్లలో జిల్లా ప్రణాళికపై జాతీయ సదస్సు నిర్వహించారు. వైస్ చాన్సలర్ జేకే రంగజనార్ధన మార్గదర్శకంలో ఈ కార్యక్రమం జరిగింది.
సీఎస్ అండ్ పీఏ ఆసోసియేట్ ప్రొఫెసర్ సదస్సు కన్వీనర్ సతీష్బాబు సదస్సు ఉద్దేశ్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ రైతు లేనిదే ప్రజల జీవితాలు లేవన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సహజమైన వాతావర ణంలో కొత్త ఉత్పత్తులను సృష్టించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. వైస్ ప్రిన్సిపాల్ టి. శ్రీనివాస్, అసోసియేట్ ప్రొఫెసర్ విభాగాధిపతి పార్వతి, వ్యవసాయ శాఖ జిల్లా సహాయ సంచాలకులు రాధాదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో విజయవంతంగా పనిచేస్తున్న రైతు భరోసా కేంద్రాలపై విశ్లేషించారు.
పూణేలోని మిట్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్శిటీ సంచాలకులు కె. గిరీశన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్లు, పిజీ విద్యార్థులు పాల్గొన్నారు.