పార్వతీపురం నియోజకవర్గం బలిజిపేట మండలం ఎంపిడిఓ కార్యాలయంలో సమావేశ మందిరంలో శనివారం ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షతన మండల అధికారులు, సచివాలయం ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మండల పరిధిలోని గల గ్రామాల వారీగా జరుగుతున్న గృహనిర్మాణాల పురోగతిపై చర్చించడం జరుగుతుంది.
మండలంలో ఇంతవరకు మంజూరు చేసిన ఇల్లు 3, 006 కాగా వాటిలో ఇప్పటికే 1061 ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకోనగా మిగతా ఇల్లు నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి అని వాటి అన్నింటినీ సత్వరం పూర్తి చేసేలా లబ్ధిదారులతో మాటలాడి సమన్వయం చేసుకుని తగు చర్యలు తీసుకోవాలని, అలానే నిర్మాణం జరుగుతున్న మరియు పూర్తి అయిన ఇల్లుకు బిల్లులు కూడా సకాలంలో చెల్లింపు జరిగేలా ఎప్పటికీ అప్పుడు చర్యలు తీసుకోవాలని, ఏ ఒక్క లబ్ధిదారులు కూడా ఇబ్బంది పడకుండా చూడాలి అని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేయడం జరిగినది. అలానే ఈ సమీక్షలో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్యం అధికారులతో కలిసి గ్రామాల వారీగా చేపట్టిన ఇంటి ఇంటి కుళాయి పనులు ప్రగతిపై సమీక్షించడం జరిగినది.
వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకొని త్రాగు నీటి ఏద్దడి లేకుండా ముందస్తుగానే అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసి ప్రజల త్రాగునీటి అవసరాలను తీర్చాలి అని ఎక్కడా కూడా నీటి కొరత లేకుండా చూడాలి అని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ సమీక్షలో మండల ఎంపీపీ గుడివాడ నాగమణి, జెడ్పీటీసీ అలజంగి రవి కుమార్, వైస్ ఎంపీపీలు బెవరా హేమలత, వెలిది సాయిరాం, ఎంపిడిఓ భాను మూర్తి, ఏంఅర్ఓ వివిఎస్ఎస్ శర్మ, హౌసింగ్ డిఈ రవి ప్రసాద్ బాబు, అర్ డబల్యుఎస్ డిఈ హనుమంత్ రావు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, ఆయా శాఖల ఏఈలు, జేఈలు, సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.