దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ , సాంకేతిక వృత్తి విద్యా కోర్సుల్లో సగం సీట్లు భర్తీ కావడం లేదు. గత పదేళ్లుగా కన్వీనర్ కోటాతో పాటు మేనేజ్‌మెంట్ కోటాలోనూ సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. కొన్ని ప్రముఖ కాలేజీల్లో మినహా చాలా కాలేజీల్లో సగానికి పైగా సీట్లు మిగిలిపోతున్నట్టు AICTI గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా గత పదేళ్లలో 40- 48% వరకు సీట్లు మిగిలిపోతున్నాయి. కరోనా తరువాత మిగులు సీట్లు 42%కి చేరాయి.