రోడ్డు ప్రమాదాల మరణాలను గణనీయంగా తగ్గించే దిశగా పటిష్ట చర్యలు చేపట్టాలని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఉప రవాణా కమిషనర్ ఎం పురేంధ్ర ఆధ్వర్యంలో జిల్లా రహదారుల భద్రత, సమన్వ య కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్పీ రాహుల్ దేవ్‌శర్మ, జేసీ అరుణ్‌బాబు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.... రోడ్డు ప్రమాదాల కారణంగా అధిక శాతం ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. గత ఏడాది 333 మంది ప్రాణాలు కోల్పోగా, 847 మంది గాయాల పాలయ్యారన్నారు. ఈ ప్రమాదాలను, మరణాలను తగ్గించే దిశగా రవాణా, పోలీస్ అనుబంధ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మద్యం సేవించి వాహనా లు నడిపే వారిని గుర్తించి తాత్కాలికంగా లైసెన్సు రద్దు చేసి పరివర్తన్ వెబ్‌సైట్లో వివరాలు పొందుపర్చాలన్నారు. ఆశ్రం ఆసుపత్రి, కలపర్రు వద్ద ఎన్‌హెచ్ 5 రహదారు లను మెరుగు పర్చాలన్నారు. రాహుల్‌దేవ్ శర్మ మాట్లా డుతూ జిల్లాలో 62 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించారని దీనికి సంబంధించి చర్యలు చేపట్టాలన్నారు. ఆర్టీవో వరప్రసాద్, డీఎంహెచ్‌వో నాగేశ్వరరావు, డీఎస్పీ పైడేశ్వరరావు, డాక్టర్ శ్రీనివాసరావు, ఆర్టీవోలు కె.శ్రీహరి, ఎండి మదానీ, తదితరులు పాల్గొన్నారు.