తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని 108 వాహన సర్వీసు సిబ్బంది డిమాం డ్ చేశారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో తమకు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలి. కాంట్రాక్టు ఒప్పంద సంస్థ వచ్చిన తరువాత తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి. ఈపీఎఫ్‌వో, ఈఎస్‌ఐ నిమిత్తం ప్రతీ నెల యాజమాన్యమే తన వాటాను చెల్లించాలి. ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలి. ఈఎంటీలకు రూ.30వేలు, ఫైలెట్లకు రూ.28 వేలు వేతనం చెల్లించాలి. ఏటా వేతనంపై 20 శాతం పెంచాల’ని కోరారు. కార్యక్రమంలో సీటూ నాయకులు సురేష్‌బాబు, తిరుపతిరావు, 108 ఉద్యోగులు విజయమోహన్, రాజశేఖర్, గణపతి, నాగభూషన్, తవిటిబాబు, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.