పశ్చిమ గోదావరి జిల్లా, కైకలూరు ప్రాంతంలో ఇటీవల కొండచిలువలు సంచారం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. శనివారం కైకలూరు మండలం నరసాయుపాలెంలో పులవ డ్రైన్లో కొండచిలువ లభ్యమైంది. చేపల వలకట్లలో ఇది చిక్కుకుంది. దీనిని చూసేందుకు స్ధానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. సుమారు 10 అడుగుల పొడవున్న కొండచిలువను వల నుంచి బయటకు తీసి అదే కాలువలోని కొంతమంది యువకులు వదిలివేశారు. అయితే ఇది ఏ క్షణాన చెరువుగట్లుపైకి వస్తుందోనని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.