ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరైన తీర్పులను ఇవ్వడంలోనే నైపుణ్యం ప్రతిఫలిస్తుంది: సీజేఐ

national |  Suryaa Desk  | Published : Sun, Jan 22, 2023, 03:55 PM

సరైన తీర్పులను ఇవ్వడంలోనే న్యాయమూర్తుల నైపుణ్యం ప్రతిఫలిస్తుందని సుప్రీకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. కాలానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని అన్వయించడంలోనే న్యాయమూర్తుల నైపుణ్యం దాగుంటుందని ఆయన అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ్యాంగంలోని పాఠ్యాంశాలను, దాని ఆత్మను చెక్కు చెదరకుండా అర్థం చేసుకోవాలని సూచించారు. ముందుకు సాగే మార్గం క్లిష్టంగా ఉన్నప్పుడు వ్యాఖ్యాతలు, దాన్ని అమలు చేసే వారికి రాజ్యాంగం నిర్దిష్టమైన దిశను అందిస్తుందని చెప్పారు. న్యాయ సమీక్ష, లౌకికవాదం, చట్టం, పాలన, అధికారాల విభజన, సమాఖ్యవాదం, స్వేచ్ఛ, వక్తిగత గౌరవం, దేశ ఐక్యత, సమగ్రత ఇవన్నీ అత్యంత ముఖ్యమైనవని తెలిపారు. మన రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణం ఉత్తర నక్షత్రం వంటిదని చెప్పారు. ముంబైలో జరిగిన నాని పాల్కీవాలా మెమోరియల్ లెక్చర్ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com