ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ కారణంగానే ఐదు శాతం మందికి జీతాలు ఆలస్యం: ఎస్ఎస్ రావత్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 22, 2023, 03:57 PM

ప్రతి నెల 5వ తేదీనాటికే 90 నుంచి 95 శాతం వేతనాలు, పింఛన్లను చెల్లిస్తున్నట్టు ఏపీ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్  పేర్కొన్నారు. మిగిలిన 5 శాతం మందికి ఖజానాలో బిల్లులు సమర్పించిన తేదీకి అనుగుణంగా చెల్లింపులు జరుగుతున్నట్టు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఆలస్యం వార్తలపై ఆయన పై విధంగా స్పందించారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం, కరోనా పరిస్థితుల కారణంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, అయినప్పటికీ ఖజానా అధికారులు నెలాఖరులోగా ఉద్యోగుల జీతాల బిల్లులు చెల్లించగలిగితే కనుక ప్రతి నెల ఒకటో తేదీనే వేతానాలు చెల్లించగలుగుతామని అన్నారు. 


రిజర్వు బ్యాంకు, బ్యాంకుల సెలవులు, రాష్ట్రంలో నిధులు, అందుబాటులో ఉన్న పరిస్థితుల ఆధారంగా చెల్లింపులు జరుగుతున్నట్టు చెప్పారు. గతంలోను, ఇప్పుడు ఇదే పద్ధతి కొనసాగుతోందని ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఉద్యోగులు, పెన్షన్‌దారులకు జీతాలు సకాలంలో ఇవ్వాలని, ఈ మేరకు చట్టం తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ ఉద్యోగ సంఘం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసిన నేపథ్యంలో రావత్ ఈ వివరణ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com