శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో ఉన్నటువంటి గ్రామాలలో సిడబ్ల్యూఎస్ స్కీమ్ క్రింద మండలానికి మంచినీరు సదుపాయం అందిస్తున్నారు. గత రెండు సంవత్సరముల నుండి నేటి వరకు జీతభత్యాలు లేనందున స్థానిక మండల సూపర్వైజర్ చెల్లా ఆనందరావు వారి బృందం మనోవేదన వ్యక్తపరిచారు. కరోనా కాలంలో మా ప్రాణాలు పణంగా పెట్టి ప్రతీ గ్రామానికి వేళ్లి ప్రజలకు త్రాగే నీరు అంతరాయం కలగకుండా బాధ్యతగా పనిచేసినందుకు ప్రభుత్వం మాపై మొండి వైఖరి చూపిస్తుందన్నారు. గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు దగ్గరికి వెళ్లి మా మనోభావేదన తెలిపినా ఏ ప్రయోజనం లేదన్నారు. జనవరి 20వ తేదీ నుండి జిల్లా యూనియన్ పిలుపుమేరకు మా అధీనంలో ఉన్న ఏ గ్రామానికి మంచినీరు అందించుటకు వీలు లేకుండా మేమంతా ఐక్యతతో బందు ప్రకటిస్తున్నామన్నారు. మా జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సూపర్వైజర్ చల్లా ఆనందరావు, నివగాం గ్రామ పంప్ ఆరేటర్ కలగాటి సురేష్, వసప గ్రామ పంప్ ఆపరేటర్ బుచ్చి భాస్కరరావు, పారాపురం గ్రామ ఆపరేటర్ గేదెల శ్రీను మరియు వాలు ఆపరేటర్లు వండాన గణపతి, రావు గేదెల రాజు పాల్గొన్నారు.