రాష్టానికి కాపు వ్యక్తి ముఖ్యమంత్రి కావాల్సివుందని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఓడించాలంటే పొత్తు ఉండాల్సిందేనని ఆయనఅభిప్రాయపడ్డారు. కాపు సంక్షేమ సేన ఆకాంక్ష, డిమాండ్ అన్నారు. తాజాగా ఆయన రాసిన ఓ లేఖ వైరల్ అవుతోంది. కాపు సంక్షేమ సేన ఆవిర్భవించిందే రెండు ఆశయాలను నెరవేర్చడం కోసమేనని.. విద్యా, ఉద్యోగాలలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులకు ప్రస్తుతం బీసీలుగా ఉన్న సామాజిక వర్ణాలకు ఎటువంటి నష్టం కలుగకుండా రిజర్వేషన్స్ దక్కించుకోవడం మొదటి ఆశయం అన్నారు. అయితే రాష్ట్ర జనాభాలో 22శాతం జనాభా ఉన్న కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం దక్కాలని.. అంటే ముఖ్యమంత్రి దక్కాలనన్నారు. విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్స్ దక్కించుకోవటమే ధ్యేయంగా కాపుసేన అనేక ఉద్యమాలు, దీక్షలు చేస్తూ వస్తోంది అన్నారు. త్వరలో కోర్టు తలుపులు తట్టబోతుందన్నారు. ఈ డిమాండు సాధించుకోవడానికి కాపు కులస్తులను ఎవరికీ తాకట్టు పెట్టకూడదనేదే కాపు సంక్షేమ సేన విధి విధానాలుగా చెప్పుకొచ్చారు.
రెండవది కాపు కులస్తులకు ముఖ్యమంత్రి పదవి దక్కటం, పరిపాలన చేపట్టడం అన్నారు హరిరామ జోగయ్య. బడుగు బలహీనవర్లాల సంక్షేమం కోరి ప్రజారాజ్యం ఏర్పాటు చేయటం.. బడుగు బలహీనవర్గాలను అధికారంలో భాగస్వాములను చేయటం.. ఈ కోరికను సాధించటమే ధ్యేయంగా జనసేన పార్టీకి కాపు సంక్షేమ సేనను అనుబంధంగా తీర్చిదిద్దబం జరిగింది అన్నారు. పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రిగా చేయటమే కాపు సంక్షేమ సేన ప్రధాన లక్ష్యమన్నారు.
రాక్షసపరిపాలన, అభివృద్ధిరహిత పరిపాలన, అవినీతి పరిపాలన సాగిస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేతను రాబోయే ఎన్నికలలో ఓడించటం ఒక్కటే జనసేన పార్టీ లక్ష్యం కాదని.. పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేయటం ద్వారా బడుగు ఐలహీన వర్షాల రాజ్యం ఏర్పాటు చేయటమే కాపు సంక్షేమ సేన ముఖ్య ఆశయంగా లేఖలో ప్రస్తావించారు. ఈ రెండవ ఆశయసాధనకు 'బడుగు బలహీనవర్గాల వారందరూ కలిసి జనసేనతో పనిచేయాలని అవినీతిరహిత -పరిపాలనకు దొహదం చేయాలంటే సరికొత్త పరిపాలన కోరుకోవాలని ఆశిస్తున్నట్లు లేఖలో రాశారు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa