మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల ఒక్క విద్యార్థి కోసమే నడుస్తుంది. 150 మంది నివసిస్తున్న గణేశ్‌పూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి వరకు బోధిస్తున్నారు. అయితే ఆ స్కూల్‌లో కార్తిక్ షెగ్‌కర్ అనే విద్యార్థి మాత్రమే చదువుకుంటున్నాడు. అతని కోసం మధ్యాహ్న భోజనంతోపాటు అన్ని వసతులు కల్పిస్తుంది ప్రభుత్వం. కిశోర్ అనే టీచర్ రోజూ 12 కి.మీ దూరం ప్రయాణించి బాలుడికి పాఠాలు నేర్పిస్తున్నాడు.