బీహార్ లో ఇటీవలే కల్తీ మద్యం తాగి 72 మంది ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కల్తీమద్యం కలకలం రేపింది. సివాన్ జిల్లాలోని లకారీ నబీగంజ్ లో నకిలీ మద్యం తాగి ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని, పోస్టుమార్టం తర్వాత స్పష్టమవుతుందని సబ్-డివిజనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అధికారి తెలిపారు.