ఏపీ ప్రభుత్వం వారాహి యాత్రను ఆపితే పాదయాత్ర చేపడతామని జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు తెలిపారు. అనంతపురంలోని చెరువుకట్టపై గుంతలను పూడ్చే శ్రమదానం కార్యక్రమానికి వచ్చిన ఆయన పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ వారాహి యాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అధిగమిస్తామని అన్నారు. ఇతర పార్టీలతో పొత్తుల విషయంపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు.