కృష్ణా జిల్లాలోని నందివాడ మండలం కుదరవల్లిలో దారుణం చోటు చేసుకుంది. వృద్ధుడిపై స్క్రూ డ్రైవర్‌తో యువకుడు దాడికి పాల్పడ్డాడు. సరిహద్దు విషయంలో వివాదం నేపథ్యంలో యువకుడు ఈ దారుణానికి తలపడ్డాడు. పాత కక్షల నేపథ్యంలో వెంకటేశ్వరరావు అనే వృద్ధుడిపై అదే గ్రామానికి చెందిన అల్లాడ చినవెంకటేశ్వరరావు దాడి చేశాడు. వెంటనే స్థానికులు వృద్ధుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.