జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ విజయనగరంలోని స్థానిక కలెక్టరేట్ సమీపంలోని మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల కూడలి వద్ద ప్రత్యేక సెల్పీ పాయింట్‌ను సోమవారం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి మొదటి ఫోటో తీసుకున్నారు. ఈ క్రమంలో ఆమెతో వృద్ధులు, హిజ్రాలు, యువ ఓటర్లతో ఫోటోలు దిగారు. స్థానిక రెవెన్యూ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు ఓటర్లు సెల్పీ ఫోటోలు దిగడానికి అనువుగా చిన్న వేదిక, థర్మాకోల్ సీట్లతో డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేశారు.కార్యక్రమంలో మున్సిపల్ సహాయ కమిషనర్ ప్రసాదరావు, స్థానిక తహసీల్దారు బంగార్రాజు, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ మహేశ్ ఇతర అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.