విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వం రంగంలోనే కొనసాగించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. సిపిఐ, ఎఐటియుసి రాష్ట్ర సమితులు ఇచ్చిన పిలుపు మేరకు రేపల్లె ఆర్డీవో కార్యాలయం వద్ద సిపిఐ, ఎఐటియుసి ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పి. నాగాంజనేయులు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పెద్ద ప్రభుత్వ రంగ పరిశ్రమ విశాఖ ఉక్కు కర్మాగారం అని దానిని కూడా ప్రైవేటుపరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర పూరిత ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు.