ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అహ్మదాబాద్ (IIMA) మార్చి నుండి అమల్లోకి వచ్చేలా ఐదేళ్ల కాలానికి ప్రొఫెసర్ భరత్ భాస్కర్‌ను కొత్త డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. జనవరి 31తో పదవీకాలం ముగియనున్న ఎర్రోల్ డిసౌజా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.ప్రస్తుతం ఐఐఎం లక్నోలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భాస్కర్ మార్చి 1 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఇన్‌స్టిట్యూట్ ఒక ప్రకటనలో తెలిపింది. తాత్కాలికంగా గవర్నర్‌ల బోర్డు ప్రొఫెసర్ అరిందమ్ బెనర్జీని ఇన్‌ఛార్జ్ డైరెక్టర్‌గా నియమించింది.