వంకాయలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. వంకాయలో పీచు, నీరు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో జీర్ణాశయంలో మంట, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. వంకాయలలో ఆంథోసైనిన్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. వీటిలో సపోనిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. అందువల్ల అధిక బరువు తగ్గుతుంది. వంకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్లు క్యాన్సర్‌ను నివారిస్తాయి. సోలాసోడిన్ క్యాన్సర్ కణాలను చంపే రామ్నోసిల్ గ్లైకోసైడ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది.