ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 6 వరకు సఖినేటిపల్లి మండలంలో వేంచేసిన రాష్ట్రవ్యాప్త ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి కల్యాణోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు రావాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు ఆలయ ఏసీ వి. సత్యనారాయణ సోమవారం విజయవాడలో ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆలయ విశిష్టత, కైంకర్యాలను ఆయనకు వివరించారు.