మార్టూరు గ్రామంలోని అమ్మ ఆశ్రమంలో 100 మంది వయోవృద్ధులకు సోమవారం రాత్రి దేవరకొట్టు ఆంజనేయులు మాస్టర్ ఆధ్వర్యంలో పర్చూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆమంచి కృష్ణమోహన్ చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ చేశారు. కాగా అమ్మ ఆశ్రమం ఎంతోమందికి కూడు, గూడు కల్పిస్తోందని ఈ సందర్భంగా ఆమంచి కొనియాడారు. ఆశ్రమ అభివృద్ధికి తన వంతు చేయూత అందిస్తానని హామీ ఇచ్చారుఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సుజ్ఞానమ్మ, వైసీపీ నాయకులు కాకులు వెంకటేశ్వర్లు, గడ్డం మస్తాన్ వలీ, పటాన్ కాలేషావలీ తదితరులు పాల్గొన్నారు.